తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2021, 4:39 PM IST

Updated : Nov 12, 2021, 10:28 PM IST

ETV Bharat / international

Premature Baby: 5 నెలలకే పుట్టిన చిన్నారి.. గిన్నిస్​ బుక్​లో స్థానం

'నెల తక్కువోడు'.. (Premature Baby) అనే ఈ మాటలను మనం చాలా సినిమాల్లో విన్నాం. హీరో తొమ్మిదో నెల కంటే ముందే పుట్టి ఉండి.. చిలిపి పనులు ఏమైనా చేస్తే అతని చుట్టుపక్కల ఉన్నవారు ఇలా సరదాగా తిడుతుంటారు. తొమ్మిది నెలలు నిండకుండే పుట్టేవాళ్లు సాధారణంగా 7 లేక 8 నెలల్లో జన్మిస్తారు. కానీ అమెరికాలో ఓ చిన్నారి కేవలం 5 నెలలకే పుట్టి గిన్నిస్​ బుక్​లో స్థానం సంపాదించాడు.

Alabama boy born in 21 weeks named world's most premature baby to survive
ఐసీయూలో ఉన్నప్పుడు చిన్నారి

5 నెలలకే పుట్టిన చిన్నారి.. గిన్నిస్​ బుక్​లో స్థానం

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో పుట్టిన ఓ బాలుడు గిన్నిస్​ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఇందుకు కారణం ఆ చిన్నారి నెలలు నిండకుండా జన్మించడమే.

సాధారణంగా పిల్లలు ఎవరైనా 9 నెలలో పుడుతారు. కానీ కర్టస్​ మీన్​ అనే ఈ చిన్నారి మాత్రం 5 నెలలకే (Premature Baby) జన్మించాడు. నిర్ణీత సమయం కంటే ముందే పుట్టడం వల్ల బాలుడు సరిగ్గా అర కేజీ కూడా లేడు. ఈ సమయంలో చిన్నారికి సరైన వైద్యం అందించిన యూఏబీ ఆసుపత్రి సిబ్బంది ప్రాణాలను కాపాడారు.

తల్లి బట్లర్​తో చిన్నారి కర్టస్​

"తొమ్మిదో నెల కంటే ముందే పుట్టిన చిన్నారులు చాలా మంది.. పురిటిలోనే చనిపోతారు. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఎందుకంటే వారిలో శరీర భాగాలు అప్పుడే పరిపక్వత చెందవు. అందుకే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కర్టస్​ 5వ నెలకే జన్మించాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతికాడు."

డా. బ్రైయిన్​ సిమ్స్​, యూఏబీ ఆసుపత్రి

పుట్టినప్పుడు 420 గ్రాములు మాత్రమే ఉన్న కర్టస్​.. రోజురోజుకు మరింత ఆరోగ్యవంతంగా అవుతున్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.

"పుట్టిన నాటి నుంచి సుమారు 275 రోజుల పాటు చిన్నారికి చికిత్స అందించాం. అనేక వైద్య పరీక్షలు చేసిన తరువాత ఏప్రిల్​లో డిశ్చార్జ్ చేశాం. ఆహారం, శ్వాస తీసుకోవడానికి చిన్నారి ఇబ్బంది పడుతున్నాడు. అందుకోసం నోరు, ముక్కు నుంచి ఆక్సిజన్​ను, ఆహారాన్ని ఇచ్చేలా పైపులను అమర్చాం."

- ఆసుపత్రి సిబ్బంది

సాధారణంగా పిండం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి 40 వారాల సమయం పడుతుంది. కానీ కర్టస్​ తల్లి గర్భంలో కవలలు ఉండడం వల్ల 5వ నెలకే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె యూఏబీ ఆసుపత్రిలో చేరింది. ప్రసవంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు కర్టస్​ కాగా మరొకరు క్యాసియా. పుట్టిన ఒక రోజు తరువాత క్యాసియా చనిపోయింది. ఈ సమయంలోనే కర్టస్​ను మూడు నెలల పాటు ఐసీయూలో ఉంచారు. ఈ సమయంలో చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఏప్రిల్​లో డిశ్చార్జ్​ అయ్యాడు.

ఐసీయూలో ఉన్నప్పుడు చిన్నారి కర్టస్​

ప్రస్తుతం 16 నెలల ఉన్న కర్టస్​.. పుట్టిన నాటి పరిస్థితితో పోల్చితే చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు సిమ్స్​ చెప్పారు. ఇలా 5వ నెలలో పుట్టి ఇన్ని నెలలు బతికినందుకుగాను కర్టస్​ గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు ఈ ఘనత రిచర్డ్​ హచిన్సన్ అనే బాలుని పేరిట ఉంది.

ఇదీ చూడండి:Raja Chari: రోదసిలోకి మన రాజాచారి!

Last Updated : Nov 12, 2021, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details