దేశవాసుల ఆయుష్షుపై వాయు కాలుష్యం గణనీయమైన ప్రభావం చూపుతోందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపీఐపీ) విడుదల చేసిన వాయు నాణ్యత జీవన సూచీ (ఎక్యూఎల్ఐ) నివేదికలో వెల్లడించింది. దేశంలో నానాటికీ తీవ్రమవుతున్న వాయుకాలుష్యాన్ని అరికట్టకపోతే భారతీయుల సగటు జీవన కాలం 5.2 సంవత్సరాలు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
గాలి కాలుష్యంతో ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు - pollution news
వాయు కాలుష్యంతో భారతీయుల ఆయుష్షుపై తీవ్ర ప్రభావం పడుతోందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన వాయునాణ్యత జీవన సూచీ వెల్లడించింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టకపోతే సగటున 5.2 సవత్సరాల ఆయుష్షు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
గాలి కాలుష్యంతో ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు
డబ్ల్యూహెచ్ఓ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కాలుష్యం అదుపునకు చర్యలు చేపడితే.. దిల్లీ పౌరుల ఆయుష్షు 9,4 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. భారత్లో వాయు కాలుష్యం 1998 నుంచి ఏటా 42 శాతం మేర వృద్ధి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: 'ఐటీఈఆర్ ప్రాజెక్టుకు భారతీయ శాస్త్రవేత్తల విశేష తోడ్పాటు'