వాతావరణంలో చాలా చిన్న పాటి రేణువులు(పీఎం 2.5)తో కూడిన కాలుష్యం వల్ల ఆ ప్రాంతంలోని వారికి తీవ్ర మతిమరుపు వ్యాధి (డిమెన్షియా) ముప్పు అధికమని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వాతావారణంలో 2.5 మైక్రోమీటర్లు, అంతకన్నా తక్కువగా ఉండే రేణువులను పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5గా పేర్కొంటారు. వీటికి డిమెన్షియాకు మధ్య సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
"క్యూబిక్ మీటరుకు ఒక మైక్టోగ్రాము మేర ఈ రేణువులు పెరిగినా డిమెన్షియా ముప్పు 16 శాతం మేర అధికమవుతుందని వెల్లడైంది. అల్జీమర్స్ తరహా డిమెన్షియా విషయంలోనూ ఇదే సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది" అని పరిశోధనకు నాయకత్వం వహించిన రేచల్ షాఫర్ తెలిపారు.