తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2020, 7:26 PM IST

ETV Bharat / international

కరోనా పంజా: కోటీ 20 లక్షలకు చేరువలో కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 20 లక్షలకు చేరువైంది. దాదాపు ఐదున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికా దేశాల్లో కేసుల సంఖ్య 5 లక్షల మార్కును దాటింది.

COVID-19 cases
కరోనా పంజా: కోటీ 20 లక్షలకు చేరువలో కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వివిధ దేశాల్లో రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 20 లక్షలకు చేరువైంది. 5.47 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 11,988,088
  • మొత్తం మరణాలు: 547,489
  • యాక్టివ్​ కేసులు: 4,501,221
  • కోలుకున్నవారు: 6,939,378

ఆఫ్రికాలో విజృంభణ

ఆఫ్రికాలోని 54 దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల మార్కును దాటింది. దక్షిణాఫ్రికాలో మరో 10వేల కేసులు నమోదైన నేపథ్యంలో ఆ సంఖ్య 5,04,000 చేరింది. అయితే.. సరిపడా పరీక్ష కిట్లు అందుబాటులో లేనందున వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రష్యాలో..

రష్యాలో కొవిడ్​-19 ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,562 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 173 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 700,792కు చేరింది. మరణాలు 10,667కు చేరాయి.

మెక్సికోలో..

మెక్సికోలో కరోనా వైరస్​ వేగంగా విజృంభిస్తోంది. కొత్తగా 6,258 కేసులు నమోదయ్యాయి. 895 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 2,68,008, మరణాలు 32,014కు చేరాయి.

పాక్​లో..

పాకిస్థాన్​లో 2,980 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 83 మంది మరణించారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 237,489కు, మరణాలు 4,922కు చేరాయి.

ఎంపీ రాజీనామా..

18 మంది కరోనా రోగుల వివరాలను మీడియాకు వెల్లడించిన కారణంతో న్యూజిలాండ్​లో ప్రతిపక్ష ఎంపీ హమిశ్​ వాకర్​ తన పదవికి రాజీనామా చేశారు. తాను చేసిన పనికి క్షమాపణలు కోరారు. సెప్టెంబర్​లో జరగనున్న సాధారణ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు ఇలా

దేశం కేసులు మరణాలు
అమెరికా 3,097,602 133,994
బ్రెజిల్​ 1,674,655 66,868
రష్యా 700,792 10,667
పెరు 309,278 10,952
చిలీ 301,019 6,434
స్పెయిన్​ 299,210 28,392
యూకే 286,349 44,391

ABOUT THE AUTHOR

...view details