తెలంగాణ

telangana

ETV Bharat / international

'అఫ్గాన్, మయన్మార్​లు ఐరాసలో ప్రసంగించవు' - ఐక్యరాజ్య సమితిలో అఫ్గాన్ ప్రతినిధి

వివిధ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్థాన్, మయన్మార్ దేశాలు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో(UNGA) ప్రసంగించబోవని ఐరాస అధికారి ఒకరు వెల్లడించారు.

uno
ఐరాస

By

Published : Sep 27, 2021, 9:20 PM IST

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో(United Nations General Assembly) భాగంగా నిర్వహించనున్న సాధారణ చర్చలో అఫ్గానిస్థాన్, మయన్మార్(United Nations Myanmar) దేశాలు ప్రసంగించబోవని ఐక్యరాజ్యసమితికి చెందిన అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు సమావేశాల చివరిరోజైన సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) జరగనున్న అత్యున్నత స్థాయి చర్చల్లో ప్రసంగించే దేశాల జాబితా విడుదలైంది. దీనిలో అఫ్గాన్(Afghanistan United Nations), మయన్మార్ దేశాల పేర్లను చేర్చలేదు ఐరాస.

ఈ జాబితాలో అఫ్గాన్ ప్రతినిధిగా హెచ్‌ఈ గులాం ఎం.ఇసాక్జాయ్ ఉన్నప్పటికీ ప్రసంగించే అవకాశం లేదు. ఇక తిరుగుబాటు ద్వారా మయన్మార్‌ ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న సైనిక పాలకులు మయన్మార్ తరఫున ఐరాస ప్రతినిధి(Myanmar United Nations Ambassador) క్యో మో టన్​ను తొలగించారు. అయన స్థానంలో ఆంగ్ తురీన్​ను ఉంచాలని కోరుతున్నారు.

గతవారం అఫ్గానిస్థాన్ రాయబారిగా సుహైల్ షహీన్‌ను ప్రతిపాదించిన తాలిబన్లు.. సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్​ను కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details