Joint Base Andrews: అమెరికాలోని అధ్యక్షుడు సహా ఉన్నతాధికారులకు సేవలు అందించే వైమానిక స్థావరం.. జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద భద్రతా కారణాల వల్ల లాక్డౌన్ విధించారు అధికారులు. ఎయిర్‌బేస్ వద్ద గుర్తుతెలియని ఓ సాయుధుడిని అధికారులు గుర్తించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఆమె భర్త డౌగ్ ఎంహోఫ్తో కలిసి అక్కడి నుంచి నావల్ అబ్జర్వేటరీకి ప్రయాణమైన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది.
కమలా హారిస్ వెళ్లిన ఎయిర్‌బేస్ వద్ద సాయుధుడి కలకలం! - వైమానిక స్థావరం వద్ద లాక్డౌన్
Joint Base Andrews: అమెరికాలోని వైమానిక స్థావరం జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఓ సాయుధుడు కలకలం సృష్టించాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రయాణిస్తున్న విమానం అక్కడి నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగటం గమనార్హం.
![కమలా హారిస్ వెళ్లిన ఎయిర్‌బేస్ వద్ద సాయుధుడి కలకలం! kamala harris](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14659479-thumbnail-3x2-kamala.jpg)
కమలా హారిస్ వెంట వచ్చిన కేబినెట్ సెక్రటరీలను కూడా ఘటనాస్థలం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 'జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ఏం జరుగుతోంది అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఘటనాస్థలంలో ఓ సాయుధుడిని గుర్తించామని.. అయితే ఎలాంటి కాల్పులు జరగలేదని మా వాహనాన్ని తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది చెప్పారు' అని శ్వేతసౌధం సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చూడండి :ఆగని బాంబుల మోత.. ఉక్రెయిన్ను కమ్మేస్తున్న రష్యా సేనలు