తెలంగాణ

telangana

ETV Bharat / international

'పిల్లల బెడ్​రూంలోకి లాక్కెళ్లి, బలవంతంగా ముద్దాడి...' - అంతర్జాతీయ వార్తలు తెలుగు

హాలీవుడ్​ నిర్మాత హార్వే వైన్​స్టీన్​ లైంగిక దాడుల కేసు విచారణలో సంచలన విషయాలను వెల్లడించింది ఫిర్యాదుదారు మిమి హాలేయీ. తనను పిల్లల బెడ్​రూంలోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశాడని తెలిపింది.

US-WEINSTEIN-TRIAL
US-WEINSTEIN-TRIAL

By

Published : Jan 28, 2020, 11:20 AM IST

Updated : Feb 28, 2020, 6:26 AM IST

మీటూ ప్రకంపనలకు కారణమైన హాలీవుడ్​ నిర్మాత హార్వే వైన్​స్టీన్​ కేసు విచారణ అమెరికా మన్​హటన్​ కోర్టులో జరుగుతోంది. ప్రధాన ఫిర్యాదుదారుల్లో ఒకరైన మిమి హాలేయీ తనకు జరిగిన ఘోరాన్ని కోర్టుకు వివరించి కన్నీరు పెట్టుకుంది.

వైన్​స్టీన్​ సంస్థలో ప్రొడక్షన్​ అసిస్టెంట్​గా పనిచేసినప్పుడు 2006 జులైలో ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపించింది మిమి. తను రుతుక్రమంలో ఉన్న సమయంలో వైన్​స్టీన్​ న్యూయార్క్​ ఇంటిలోని పిల్లల గదిలో లైంగికంగా వేధించాడని కోర్టుకు తెలిపింది.

"నాకన్నా3రెట్లు ఎక్కువ బరువు ఉండేవాడు వైన్​స్టీన్​.మొదటగా స్నేహపూర్వకంగా మెలిగేవాడు.ఓ రోజు తన ఇంటిలోని పిల్లల గదికి తీసుకెళ్లాడు.అకస్మాత్తుగా నన్ను పట్టుకుని ముద్దు ఇచ్చాడు.వద్దని ఎంతో ప్రాధేయపడ్డాను.

బలవంతంగా నన్ను మంచంపైకి నెట్టాడు.నోటితో స్పర్శించాడు.అక్కడనుంచి బయటపడేందుకు ఎంతో ప్రయత్నించాను.కానీ సాధ్యం కాలేదు."

-మిమి హలేయీ

ఫిన్​లాండ్​కు చెందిన హలేయీ.. ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయాన్ని దాచిందో వివరించారు. చెల్లుబాటయ్యే వర్క్​వీసా లేకపోతే అమెరికాలో ఉన్న తనకు బహిష్కరణ తప్పదనే భయంతో ఇన్ని రోజులు ఘటనపై ఫిర్యాదు చేయలేదన్నారు. ఆ సమయంలో పోలీసుల వద్దకు వెళ్లే అవకాశం తనకు లేదని తెలిపింది. వైన్​స్టీన్​కు డబ్బు, పలుకుబడి ఉండటం వల్ల వెనకడుగు వేశానని చెప్పింది హలేయీ.

అయితే విచారణలో భాగంగా హలేయీ ఆరోపణలను అటార్నీ డామన్​ కెరానిస్​ సవాలు చేశారు. అత్యాచారం నిజమే అయితే రెండేళ్ల క్రితం హార్వేకు స్నేహపూర్వకంగా సందేశం ఎలా పంపారని ప్రశ్నించారు.

ఎన్నో ఆరోపణలు..

వైన్​స్టీన్​పై సుమారు 80 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్​ కథానాయికలు కూడా ఉన్నారు. అయితే వైన్​స్టీన్​పై ఇద్దరికి సంబంధించిన ఫిర్యాదులను నమోదయ్యాయి. అందులో హలేయీతోపాటు నటి జెస్సికా మాన్​ ఉన్నారు. 2013లో వైన్​స్టీన్​ తనను అత్యాచారం చేశాడని జెస్సికా ఫిర్యాదు చేసింది. ఈ కేసులు రుజువైతే వైన్​స్టీన్​కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది.

వైన్​స్టీన్​ మాత్రం తన లైంగిక సంబంధాలన్నీ పరస్పర అంగీకారంతో ఉన్నవేనని స్పష్టం చేశాడు.

వైన్​స్టీన్​ అకృత్యాలు బయటపడిన నేపథ్యంలో మీటూ ఉద్యమానికి పునాది పడింది. లక్షలాది మంది మహిళలు తమ జీవితంలో ఎదురైన దాడుల గురించి బహిర్గతం చేశారు.

Last Updated : Feb 28, 2020, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details