తెలంగాణ

telangana

ETV Bharat / international

నమస్తే ట్రంప్​: అధ్యక్షుడి జీవితంలోని ఆ ముగ్గురు మహిళలు... - trump family and children

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తికరమే. ఆయన వ్యక్తిగత జీవితంలోనూ అలాంటివి చాలానే ఉన్నాయి. ట్రంప్​కు ముగ్గురు భార్యలు, ఐదుగురు సంతానం. వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు సహా ట్రంప్​ గురించి మరిన్ని విషయాలు.

about us president trump family and children
నమస్తే ట్రంప్​: అధ్యక్షుడి​ గురించి ఈ విషయాలు తెలుసా?

By

Published : Feb 21, 2020, 3:53 PM IST

Updated : Mar 2, 2020, 2:05 AM IST

డొనాల్డ్​ ట్రంప్​... ప్రపంచంలో అత్యధిక ప్రజాకర్షణ ఉన్న నేత. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమే. వృత్తి, వ్యాపారం, రాజకీయమే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ ఆయన నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి. అధ్యక్షుడి గురించి ఆసక్తికర విషయాలు చూద్దాం.

డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ 1946 జూన్‌ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించారు. తండ్రి ఫ్రెడరిక్‌ ట్రంప్‌ ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి. తల్లి మేరీ మెక్‌లీడ్‌, స్కాట్లాండ్‌లోని టోంగ్‌కు చెందినవారు. పరోపకారి, సామాజిక కార్యకర్త. వీరి ఐదుగురు సంతానంలో డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగో వ్యక్తి.

చురుకు...

చిన్నప్పటి నుంచీ చురుగ్గా ఉండే ట్రంప్‌ను ఆయన తండ్రి న్యూయార్క్‌ మిలిటరీ అకాడమీలో చేర్పించారు. తర్వాత ఫోర్దమ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో చదువుకున్నారు. 1968లో అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు.​

ముగ్గురు భార్యలు, ఐదుగురు సంతానం...

1. ఇవానా ట్రంప్‌:న్యూయార్క్‌ ఫ్యాషన్‌ మోడల్‌ ఇవానా ట్రంప్‌ను 1977లో ట్రంప్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.. డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, ఇవాంక, ఎరిక్‌. విభేదాలతో 1992లో ట్రంప్‌, ఇవానా విడిపోయారు.

మార్లా మేపిల్స్‌, ట్రంప్​ రెండో భార్య

2. మార్లా మేపిల్స్‌: 1993లో నటి మార్లా మేపిల్స్‌ను ట్రంప్‌ రెండో వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె టిఫానీ. 1999లో 20 లక్షల డాలర్లు భరణంగా చెల్లించి మేపిల్స్‌ నుంచి ట్రంప్‌ విడాకులు తీసుకున్నారు.

సతీమణి మెలనియాతో ట్రంప్

3. మెలనియా: స్లొవేనియా మాజీ మోడల్‌, తనకన్నా 23 ఏళ్లు చిన్న అయిన మెలనియాను 2005లో ట్రంప్‌ మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెతోనే ట్రంప్‌ కలిసి ఉంటున్నారు. వీరికి బారెన్‌ విలియం అనే కుమారుడు.

ఇవాంక ట్రంప్​

ట్రంప్‌ తనయులు డొనాల్డ్‌ జూనియర్‌, ఎరిక్‌, కుమార్తె ఇవాంక ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు. తండ్రి వ్యాపారాల్ని తనయులు చూస్తుంటారు. ఇవాంక మాత్రం అధ్యక్షుడికి సహాయకారిగా వ్యవహరిస్తారు. ఇవాంక భర్త జారెడ్ కుష్నర్‌ కూడా ట్రంప్‌కు సలహాదారు.

Last Updated : Mar 2, 2020, 2:05 AM IST

ABOUT THE AUTHOR

...view details