అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. దాదాపు 69 శాతం మంది అమెరికన్ ముస్లింలు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు ఓటు వేసినట్టు ఓ సర్వేలో తేలింది. కేవలం 17 శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతిచ్చినట్టు వెల్లడైంది.
బైడెన్‌కు భారీగా పడిన ముస్లింల ఓట్లు!
అగ్రరాజ్యంలోని అతిపెద్ద ముస్లిం పౌర హక్కుల సంస్థ సీఏఐఆర్.. 2020 అధ్యక్ష ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. 69 శాతం మంది అమెరికన్ ముస్లింలు జో బైడెన్‌కు ఓటు వేయగా.. ట్రంప్‌కు 17 శాతం మద్దతిచ్చినట్టు పేర్కొంది.
2020 ముస్లిం ఓటర్స్- ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్‌ను మంగళవారం విడుదల చేసింది సీఏఐఆర్(ద కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్). ఇది దేశంలోనే అతి పెద్ద ముస్లిం పౌర హక్కుల సంస్థ.
అగ్రరాజ్యంలోని 10 లక్షల మంది ముస్లిం ఓటర్లు.. ఈసారి రికార్డు స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపింది సీఏఐఆర్. సర్వేలో పాల్గొన్న 844 మందిలో 84 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు వెల్లడించింది. ఇందులో 69 శాతం మంది బైడెన్‌కు, 17 శాతం మంది ట్రంప్‌కు ఓటు వేసినట్టు పేర్కొన్నారు. 2016తో పోల్చితే ట్రంప్‌కు ముస్లింల మద్దతు 4శాతం పెరిగింది.