తెలంగాణ

telangana

ETV Bharat / international

'నోబెల్ ఇస్తే నాకేంటి..? నా నిద్రే నాకు ముఖ్యం' - national news in telugu

నోబెల్ పురస్కారాన్ని అందుకోనుండటంపై హర్షం వ్యక్తం చేశారు భారత సంతతి ఆర్థిక పరిశోధకుడు అభిజిత్ బెనర్జీ. తనలాంటి పరిశోధకులు మరింత ఆత్మవిశ్వాసంతో పనిచేసేలా ఈ అవార్డు స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. నోబెల్ వార్త విన్న అనంతరం తన భర్త వెళ్లి పడుకున్నారని వెల్లడించారు బెనర్జీ సతీమణి ఎస్తేర్ డుఫ్లో.

abhijit benerjee

By

Published : Oct 15, 2019, 5:31 PM IST

అభిజిత్ బెనర్జీ, నోబెల్ పురస్కార విజేత

ప్రపంచ పేదరిక నిర్మూలన కోసం చేసిన కృషికి గుర్తింపుగా తనకు నోబెల్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు భారత సంతతి పరిశోధకుడు అభిజిత్ బెనర్జీ. 2019 ఏడాదికి ఆర్థిక శాస్త్రంలో ఆయన సతీమణి ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రేమెర్ అనే పరిశోధకుడితో ఈ పురస్కారాన్ని పంచుకోనున్నారు బెనర్జీ.

ఈ పురస్కారాన్ని పొందడం సంతోషంగా ఉంది. ఈ పురస్కారం మాకు వచ్చిందని భావించడం లేదు. ఇది పేదరిక నిర్మూలన ఉద్యమానికి వచ్చిన పురస్కారంగా భావిస్తున్నాం. ఈ పురస్కారం వల్ల ఇతర పరిశోధకులకు ప్రోత్సాహం లభిస్తుంది. మనకు రాదు అనుకునే వారికి ప్రోత్సాహం అందిస్తుంది.

-అభిజిత్ బెనర్జీ, నోబెల్ పురస్కార విజేత

విని వెళ్లి పడుకున్నారు..!

నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన వార్త విని తన భర్త సాధారణంగా వెళ్లి పడుకున్నారని వెల్లడించారు ఎస్తేర్. భారత్, ఐరోపాల నుంచి ఫోన్లు రావడం ప్రారంభం కాకముందే ఇంకాసేపు నిద్రించాలని భావించానని తెలిపారు అభిజిత్.

"వేకువజామునే వార్త అందింది. నేను పొద్దున్నే లేచే వ్యక్తిని కాను. ఒకవేళ నేను నిద్రించకపోతే నా జీవ వ్యవస్థకు సమస్య ఉత్పన్నమవుతుందని భావించాను."

-అభిజిత్ బెనర్జీ, నోబెల్ పురస్కార విజేత

ఇదీ చూడండి:గాంధీ ఎలా 'ఆత్మహత్య' చేసుకున్నారో మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details