అమెరికాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కన్న పిల్లలనే హత్య చేసింది. అనంతరం తన భర్తనూ హత్య చేస్తానని బెదిరించింది. టెంపే ఆరిజోనాలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది.
జపాన్‌కు వెళ్లేందుకు తనకు కావాల్సిన డబ్బుల విషయంలో వాగ్వాదం జరగ్గా.. ఆ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మాంసం కోసే కత్తితో తన పిల్లలైన 7 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల బాలికనుహత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితురాలు యుయి ఇనౌస్ను అరెస్టు చేసినట్లు చెప్పారు.