తెలంగాణ

telangana

డోరియన్​ తుపాను ధాటికి అమెరికా గజగజ

డోరియన్​ తుపాను అమెరికాపై విరుచుకుపడుతోంది. ఫ్లోరిడా, జార్జియా, కరోలినా రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రచండ గాలులతో వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. బహమాస్​లో తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 43కు చేరింది.

By

Published : Sep 7, 2019, 10:03 AM IST

Published : Sep 7, 2019, 10:03 AM IST

Updated : Sep 29, 2019, 6:09 PM IST

డోరియన్​ తుపాను ధాటికి అమెరికా గజగజ

డోరియన్​ తుపాను ధాటికి అమెరికా గజగజ
అట్లాంటిక్​ సముద్రంలో మొదలైన డోరియన్​ తుపాను.. అమెరికాపై విరుచుకుపడుతోంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను ప్రభావానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఫ్లోరిడా, జార్జియా, కరోలినా రాష్ట్రాలపై డోరియన్​ ప్రభావం అధికంగా ఉంది. ఉత్తర కరోలినాలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. సుమారు 5 లక్షల మంది స్థానికులు, పర్యటకులను కరోలినా ద్వీపకల్పం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తుపాను ధాటికి 2 లక్షలకుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

బహమాస్​లో 43 మంది మృతి

డోరియన్​ తుపాను ధాటికి ఉత్తర అమెరికా ద్వీపదేశం బహమాస్​ అతలాకుతలమయింది. తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 43కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరదల్లో గల్లంతయిన వారి ఆచూకీ ఇంక లభించలేదు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​ 'పెళ్లి పందిరి'- ఇక అమెరికాలో అధికారికం!

Last Updated : Sep 29, 2019, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details