నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ 'మోన్సాంటో'కు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కోర్టు భారీ జరిమానా విధించింది. కంపెనీకి చెందిన కలుపు నివారిణి 'రౌండప్'తో తన భర్తకు క్యాన్సర్ వచ్చిందని కాలిఫోర్నియాలోని 70 ఏళ్ల మేరీ హర్డీమన్ ఫిర్యాదు చేశారు. విచారించిన న్యాయస్థానం పరిహారంగా 80 మిలియన్ డాలర్లు (రూ.556 కోట్లు) హర్డీమన్కు చెల్లించాలని తీర్పునిచ్చింది.
రౌండప్ తయారీలో లోపముందని హర్డీమన్ ఆరోపించారు. ఉత్పత్తిపై సరైన హెచ్చరికలు లేవని తెలిపారు. మోన్సాంటో సంస్థ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు హర్డీమన్. మోన్సాంటోపై అమెరికాలో ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి.
న్యాయస్థానం తీర్పును హర్డీమన్ తరఫు న్యాయవాదులు ఎమీ వాగ్స్టాఫ్, జెన్నిఫర్ మూరే ప్రకటించారు. ఈ నిర్ణయం మిగతా కేసులకు ఓ దారి చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.