తెలంగాణ

telangana

ETV Bharat / international

అక్కడ కొవిడ్​ టెస్టుకు రూ. 40 లక్షల బిల్లు!

ఫలితాలు త్వరగా వస్తాయని భావించిన ఓ వ్యక్తి కరోనా పరీక్షలను ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకున్నాడు. అతను అనుకున్నట్టుగానే పరీక్షలు వేగంగా అయిపోయాయి కానీ.. ఆ తర్వాత వచ్చిన బిల్లు చూసి అతనికి నోటమాటరాలేదు. ఇంతకీ అతనికి వచ్చిన బిల్లు ఎంతో తెలుసా?.. రూ.40 లక్షలకు పైనే!

huge bill for covid test
కొవిడ్​ టెస్టుకు రూ. 40 లక్షల బిల్లు!

By

Published : Oct 1, 2021, 6:37 PM IST

Updated : Oct 1, 2021, 7:11 PM IST

ఉచితంగా కొవిడ్​ పరీక్షలు చేసే కేంద్రాల వద్ద వెయిట్​ చేయలేని వారు డబ్బులు చెల్లించి ప్రైవేట్​ ఆసుపత్రులలో టెస్టులు చేయించుకుంటున్నారు. ఉచిత కేంద్రాలతో పోలిస్తే.. ఇక్కడ పరీక్ష ప్రక్రియ త్వరగా జరగడం సహా ఫలితాలు కూడా వేగంగా వస్తాయని చాలా మంది భావిస్తారు. ఇదే విధంగా ఆలోచించిన ఓ వ్యక్తి.. తన భార్యతో సహా ఓ ప్రైవేట్​ సెంటర్​లో కొవిడ్​ పరీక్షలు చేయించుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బిల్లు చూసేసరికి అతనికి తల తిరిగినంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

అమెరికాలోని టెక్సాస్(Texas news today)​ రాష్ట్రం దల్లాస్​కు చెందిన ట్రేవిస్​ వార్నర్​.. గతేడాది జూన్​లో కొవిడ్​ టెస్టు చేయించుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా టెస్టులు చేసే సెంటర్లలో రద్దీ ఎక్కువగా ఉండటం సహా ఫలితాలకు ఎక్కువ సమయం పడుతుందని భావించిన వార్నర్​.. ఓ ప్రైవేటు టెస్టింగ్​ సెంటర్​ను సంప్రదించాడు. లీవిస్​విల్లీలోని సిగ్నేచర్​ కేర్​ ఎమర్జెన్సీ సెంటర్​లో(Texas news today) పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న వార్నర్​.. అతని భార్యతో సహా అక్కడికి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు. ఎమర్జెన్సీ రూమ్​లో పరీక్షలు నిర్వహించడం వల్ల టెస్టింగ్​ వేగంగానే పూర్తయింది.

బిల్లు చూసేసరికి..

కానీ అసలు సమస్య అంతా ఈ టెస్టింగ్​కు(Texas news today) సంబంధించి అతనికి వచ్చిన ఈ-మెయిల్​తో మొదలైంది. ఈ పరీక్షలకు అదనపు చార్జీలతో కలిపి వార్నర్​కు 56,384 డాలర్లు (రూ.41,77,095) బిల్లు వచ్చింది. ఇంత భారీ మొత్తం బిల్లు వచ్చేసరికి వార్నర్​కు ఏం చేయాలో అంతుచిక్కలేదు. చివరకి ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించి.. ఆ బిల్లును 16,915 డాలర్లకు (రూ.12,53,113) తగ్గించుకుని ఆ మొత్తాన్ని చెల్లించేశాడు.

ఇదీ చూడండి :'ప్రాంతీయ భద్రతకు భారత్​-అమెరికా సైన్యాల సహకారం'

Last Updated : Oct 1, 2021, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details