ఆగ్నేయ బ్రెజిల్ దక్షిణాది రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోలో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా వరదలు సంభవించి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు... ఆరుగురు మృతి - ఆరుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆగ్నేయ బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటోను భారీ వరదలు ముంచెత్తాయి. పలు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
![బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు... ఆరుగురు మృతి a-storm-on-friday-unleashed-heavy-rains-causing-flooding-in-the-southern-state-of-espirito-santo-in-southeastern-brazil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5770357-thumbnail-3x2-brazil.jpg)
బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు... ఆరుగురు మృతి
బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు... ఆరుగురు మృతి
24 గంటల నుంచి కురుస్తోన్న వర్షాల కారణంగా ఐకాన్హా మరియు అల్ఫ్రెడో చావెస్ నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. వరదలకు పలు ప్రాంతాల్లోని భవనాలు, వ్యాపార సముదాయాలు నీటమునిగాయి. పలు వీధులు బురదమయ్యాయి. ఈ వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటి వరకు ఎంత మంది గల్లంతయ్యారో తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఫుట్‌బాల్ స్టేడియం గ్యాలరీ కూలి 50మందికి గాయాలు!
Last Updated : Jan 20, 2020, 9:55 AM IST
TAGGED:
6 people died