తెలంగాణ

telangana

ETV Bharat / international

రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్​!

దక్షిణ కాలిఫోర్నియా పోలీసు విభాగంలో కొత్తగా 'హెచ్​పీ రోబ్​ కాప్​'ను ప్రవేశపెట్టారు. ఈ రోబో పార్కులు, భవన సముదాయాల వద్ద కాపలా విధులు నిర్వహిస్తుంది.

By

Published : Jun 19, 2019, 11:47 AM IST

రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్​!

రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్​!

దక్షిణ కాలిఫోర్నియా పోలీసులు కొత్తగా తమ విభాగంలోకి ఓ రోబో పోలీసును ప్రవేశపెట్టారు. 'హెచ్​పీ రోబో కాప్​' అని పిలుచుకుంటున్న ఈ రోబో పోలీసు... ఉద్యానవనాలు, భవన సముదాయాల వద్ద కాపలా విధులు నిర్వహిస్తుంది.

నీలం-తెలుపు రంగుల్లో ఉండే ఈ రోబో పోలీసు... 360 డిగ్రీల్లో చాలా స్పష్టమైన వీడియోలను చిత్రీకరిస్తుంది. పోలీసులు నిత్యం పహారా కాయలేని ప్రదేశాల్లో ఇది తన సేవలను అందిస్తుంది.

మంగళవారం సాయంత్రం నిర్వహించిన వేడుకలో... ఈ రోబో అధికారికంగా దక్షిణ కాలిఫోర్నియా పోలీసు విభాగంలో చేరింది. దీనికి సొంతంగా ఓ ట్విట్టర్ పేజీ కూడా ఉంది.

లాస్​ ఏంజెల్స్​లో గత నెల నిర్వహించిన​ 5కె రన్​ సందర్భంగా ఈ రోబోట్ మొదటిసారిగా వినియోగించారు. అప్పటి నుంచి అది తన సేవలను అందిస్తూనే ఉంది.

ఇదీ చూడండి: రాహుల్ కోసం మోదీ 'హ్యాపీ బర్త్​డే ట్వీట్​'

ABOUT THE AUTHOR

...view details