ఇళ్లపై కూలిన విమానం.... ఇద్దరి మృతి - దక్షిణ కాలిఫోర్నియా
దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సమీప ఇళ్లపై కూలిపోయింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇళ్లపై కూలిన విమానం
భయాందోళనలకు గురైన ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. మృతి చెందిన వారు విమానంలోని సిబ్బందా... బయటి వారా అనేది తెలియాల్సి ఉంది.