అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఆగంతుకుడు రెచ్చిపోయాడు. కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఫెస్టివల్‌కు హాజరైన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 12మందికి గాయాలయ్యాయి.
సాన్‌జోస్‌కు 48 కిలోమీటర్ల దూరంలో జరిగిన గార్లిక్ ఫెస్టివల్‌ను లక్ష్యంగా చేసుకుని 30 ఏళ్ల యువకుడు దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.