తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాకు మొక్కల ఆధారిత టీకా! - corona virus vaccine latest update

కరోనా వైరస్​ వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. టీకా అభివృద్ధి దిశగా ఇప్పటికే పలు దేశాలు ప్రయోగాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో తాము తయారు చేసిన మొక్కల ఆధారిత టీకా.. ఎలుకలపై మంచి ఫలితాలు ఇచ్చిందని కెనడాకు చెందిన మెడికాగో కంపెనీ వెల్లడించింది. రెండో డోస్​ ఫలితాలు వచ్చాక మనుషులపై ప్రయోగాలు చేస్తామని తెలిపింది.

A plant-based vaccine for corona
కరోనాకు మొక్కల ఆధారిత టీకా!

By

Published : May 16, 2020, 9:41 AM IST

కొవిడ్‌-19కు తాము తయారుచేసిన మొక్కల ఆధారిత టీకా.. ఎలుకలపై మంచి ఫలితాలు ఇచ్చిందని కెనడాకు చెందిన మెడికాగో కంపెనీ వెల్లడించింది. "ఎలుకలపై ఒక మోతాదు (సింగిల్‌ డోస్‌) ప్రయోగించాం. పది రోజుల్లోనే వాటిలో సకారాత్మక ప్రతిరక్షక (యాంటీబాడీ) స్పందన వచ్చింది. రెండో డోస్‌ ఫలితాలు వచ్చిన వెంటనే మనుషులపై ప్రయోగాలకు కెనడా ప్రభుత్వానికి, అమెరికా ఎఫ్‌డీఏకి దరఖాస్తు చేస్తాం" అని ఆ కంపెనీ వెల్లడించింది. ఈ టీకాని మనుషులకు ఎంత మోతాదు ఇవ్వాలనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. అన్నీ పూర్తి చేసుకుని ఈ సంవత్సరం చివరికి లక్షల సంఖ్యలో డోసులను సిద్ధం చేస్తామని తెలిపింది.

కరోనా వైరస్‌ జన్యురూపం తెలిసిన 20 రోజుల్లోనే (మార్చి మొదటిలోనే) ఈ కంపెనీ వైరస్‌ లాంటి కణాన్ని (వీఎల్‌పీ) తయారుచేసి, ముందస్తు ప్రయోగ పరీక్షలు చేపట్టింది. జూన్‌లో మొదటి దశ ప్రయోగ పరీక్షలు, తర్వాత రెండో దశ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. మొక్కల ఆధారిత టీకా సాంకేతికతలో మెడికాగో తొలి స్థానంలో ఉంది. గతంలో ఫ్లూకి సంబంధించి పలు వ్యాక్సిన్లను ఆవిష్కరించింది. 2009లో హెచ్‌1ఎన్‌1పై ప్రయోగ స్థాయి వ్యాక్సిన్‌ని 19 రోజుల్లోనే అభివృద్ధి చేసింది.

ABOUT THE AUTHOR

...view details