ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన టీకా ప్రయోగాల్లో భాగంగా ఓ వలంటీరు మరణించినట్లు వార్తలు వచ్చిన తరుణంలో.. ఓ కీలక విషయం తెలిసింది. అసలు ఆ మృతుడు కొవిడ్ టీకాను వేయించుకోలేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఆ టీకా కారణంగానే ఓ వ్యక్తి మృతి చెందినట్లు బుధవారం బ్రెజిల్ ఆరోగ్య విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ట్రయల్స్‌లో పాల్గొన్న వ్యక్తి మరణించిన విషయం తమకు సోమవారం తెలిసిందని, ట్రయల్స్ భద్రతను అంచనా వేసే అంతర్జాతీయ కమిటీ నుంచి పాక్షిక నివేదిక అందిందని బ్రెజిల్ వైద్యాధికారి వెల్లడించారు. అలాగే వాటిని కొనసాగించాలని ఆ కమిటీకి సూచించినట్లు వెల్లడించారు.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్.. ప్రస్తుతం పలు దేశాల్లో ప్రయోగ దశలో ఉంది. అయితే.. కొద్ది రోజుల క్రితం బ్రిటన్‌లో ఒక వలంటీరు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తరవాత యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్‌లో ఆ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించారు. కానీ.. అమెరికాలో మాత్రం ఆ ప్రయోగాలను నెల రోజులకుపైగా నిలిపివేశారు. ఇటీవల ఒక వలంటీరుకు అనారోగ్య సమస్య తలెత్తడం వల్ల.. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ టీకా ప్రయోగాలకు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది.
'ఆ వలంటీర్ ఆస్ట్రాజెనికా టీకా వల్ల చనిపోలేదు'! - Corona vaccine today news'
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షల్లో.. ఇటీవల ఓ వలంటీర్ మృతిచెందినట్టు వచ్చిన వార్తలపై వాస్తవాలు బయటికొచ్చాయి. మరణించిన వ్యక్తి టీకా వేయించుకోలేదని తెలుస్తోంది.
ఆ మృతుడు వ్యాక్సిన్ వేయించుకోలేదట!
ఇదీ చదవండి:బ్రెజిల్లో కొవిడ్ టీకా వాలంటీరు మృతి!
Last Updated : Oct 22, 2020, 3:00 PM IST