తనపై అభిశంసన తీర్మానంలో బహిరంగ విచారణ సరిగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చరిత్రలో ఎప్పుడూ చూడని ద్వంద్వ నీతిని బహిరంగ విచారణలో పాటిస్తున్నారని పేర్కొంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బహిరంగ విచారణకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో తన మొదటి ఫోన్‌కాల్ సంభాషణ రాతప్రతిని విడుదల చేశారు ట్రంప్.
విచారణ సందర్భంగా ఉక్రెయిన్‌లో మాజీ అమెరికా రాయబారి మార్రీ యవనోవిచ్పై ప్రశ్నల వర్షం కురింపించింది కాంగ్రెస్. సమాధానంగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ చరవాణి సంభాషణపై పలు అంశాలను యవనోవిచ్ బయటపెట్టారు.
'ప్రమాదమనే తప్పించారు'
తనను అకస్మాత్తుగా రాయబారి పదవి నుంచి తొలగించారని.. వెల్లడించారు యవనోవిచ్. ఉక్రెయిన్ అధ్యక్షుడితో చరవాణి సంభాషణపై ట్రంప్ తనపై ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో వివరించారు. ప్రమాదమని పరిగణించడం వల్లే.. తనను పదవి నుంచి తప్పించారని అభిప్రాయపడ్డారు. రాయబారిగా తన పనితీరుపై ట్రంప్ ట్విట్టర్ పోస్టులు భయపెట్టేవని వ్యాఖ్యానించారు యవనోవిచ్.
'ఆమె వైఖరి సరైంది కాదు'