హారర్ మూవీలు చూస్తే వేల రూపాయలు ఇస్తామని 'ఫైనాన్స్ బజ్' (Finance Buzz) అనే సంస్థ ప్రకటించింది. ఒక్కో సినిమాకు వంద డాలర్ల లెక్కన 13 హారర్ చిత్రాలకు (Horror Movies) 1300 డాలర్లు ఇస్తామని తెలిపింది. హారర్ మూవీ హార్ట్‌రేట్ అనలిస్ట్ నియామకం కోసం ఈ ప్రకటన చేసింది. సినిమాపై.. బడ్జెట్ ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ సర్వే చేపడుతోంది.
హారర్ మూవీ హార్ట్‌రేట్ అనలిస్ట్‌గా ఎంపికైన వ్యక్తి.. ఇప్పటివరకు తీసిన అత్యంత భయంకరమైన 13 చిత్రాలను చూడాల్సి (All time Horror Movies Hollywood) ఉంటుంది. సినిమాలు చూసే సమయంలో ఫిట్‌బిట్ అనే పరికరాన్ని ఉపయోగించి హార్ట్ రేట్ మానిటర్ చేయాలి. ఎంపికైన అభ్యర్థి అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 18 మధ్య సినిమాలను చూడాలి. ఆ వ్యక్తికి ఫిట్‌బిట్ ట్రాకర్, 1300 డాలర్లతో పాటు ఖర్చులకు బదులుగా 50 డాలర్ల గిఫ్ట్ కార్డును సైతం అందిస్తుంది ఫైనాన్స్ బజ్.