అమెరికాలో అక్రమ వీసాల రాకెట్‌కు మరో 90 మంది విద్యార్థులు బలయ్యారు. అందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ మోసాలకు పాల్పడుతున్న వారిని పసిగట్టేందుకు నకిలీ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సృష్టించిన ఫెడరల్ బృందం... విద్యార్థులను అదుపులోకి తీసుకుంది.
భారతీయులే అధికం..
హోంలాండ్ సెక్యూరిటీ విభాగం డెట్రాయిట్ ప్రాంతంలో యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ పేరిట నకిలీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అమెరికా విద్యాసంస్థల్లో అక్రమంగా ప్రవేశం పొందాలనుకునే వారికి ఈ వర్సిటీ ద్వారా ఎరవేసింది. మార్చిలో వర్సిటీని మూసివేసే నాటికి ప్రవేశం కోసం 600 మంది నమోదు చేసుకోగా... వారిలో 161 మందిని అదే నెలలో అరెస్ట్ చేసింది అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ). తాజాగా మరో 90 మందిని అదుపులోకి తీసుకుంది.
సామాజిక మాధ్యమాల్లో దుమారం..
90 మంది విద్యార్థుల అరెస్ట్‌పై వార్త వెలువడిన తర్వాత దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఐసీఈని రద్దు చేయాలనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేశారు నెటిజన్లు.