Selling farts in a jar: అమెరికాలో ఓ టీవీ స్టార్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె వారానికి రూ.37లక్షలు ఎలా సంపాదిస్తుందో తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. స్టిఫెనీ మ్యాటో అనే ఈ 31 ఏళ్ల టెలివిజన్ సెలబ్రిటీ చేస్తున్న పని తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఈమె చేసేదేంటంటే.. అపానవాయువును జార్లో పెట్టి అమ్మడం. ఔను మీరు విన్నది నిజమే. స్టిఫెనీ 'బాంబులు' వేసే వారానికి లక్షలు గడిస్తోంది. ఆమె అభిమానులు కూడా ఏమాత్రం ఆలోచించకుండా వీటిని తెగ కొనేస్తున్నారు. రెండు రోజుల్లో 97 జార్లు అమ్ముడయ్యాయంటే వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది.
ఏదైనా కొత్తగా, ఫన్నీగా ఉండే వ్యాపారం చేయాలని అనుకుంటున్న సమయంలో ఈ ఆలోచన తనకు వచ్చిందని స్టిఫెనీ చెబుతోంది. అపానవాయువును జార్ పెట్టి అందులో పూల రేకులను ఉంచి ప్యాక్ చేస్తోంది. ఇలా చేస్తే పూల రేకులు అపానవాయును కూడా సువాసన వచ్చేలా చేస్తాయని వివరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా 66లక్షల మంది వీక్షించారు.
90 Day Fiance star selling farts
'90 డేస్ ఫియాన్స్' టీవీ షోతో స్టిఫెనీ తెగ పాపులర్ అయింది. అనంతరం ఆమె స్వతహాగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అందులోనే ఈ వివరాలను వెల్లడించింది. తన ధరించిన బ్రాలు, ప్యాంటీలు, దుస్తులు, సబ్బులు సహా ఇతర వస్తువులు కావాలని తన అభిమానుల నుంచి వందల సంఖ్యలో సందేశాలు వచ్చాయని స్టిఫెనీ మ్యాటో వెల్లడించింది. ఇప్పటికే 97 అపానవాయువు జార్లు విక్రయించినట్లు తెలిపింది. అంతేకాదు అభిమానులకు ధర విషయంలో భారం కాకూడదని డిస్కౌంట్తో కలిపి ఓక్కో జార్ను 1000 డాలర్లకు విక్రయిస్తోంది.
Stephanie Matto News