అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కేన్సస్ నగరంలోని బార్లో ఓ దుండగుడు తపాకీతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 9 మందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 1:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దాడికి పాల్పడింది ఒక్కరా లేదా అంతకంటే ఎక్కువా అని తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.