కరోనా మహమ్మారి(Corona virus) కట్టడికి సింగిల్ డోసుతో పోల్చితే.. రెండో డోసు తీసుకున్నాక రక్షణ ఎక్కువగా ఉంటుందని అంతా భావిస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. ఫైజర్ వ్యాక్సిన్(Pfizer shot) రెండో డోసు(Covid-19 vaccine) తీసుకున్న ఆరు నెలల తర్వాత.. కొవిడ్-19 యాంటీబాడీలు ఏకంగా 80 శాతం మేర తగ్గిపోతున్నట్లు గుర్తించారు. అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిసర్వ్ వర్సిటీ, బ్రౌన్ వర్సిటీ పరిశోధకులు.. 120మంది నర్సింగ్ హోమ్ నివాసితులు, వారిని చూసుకుంటున్న 92 మంది ఆరోగ్య కార్యకర్తల రక్త నమూనాలను పరీక్షించి ఈ విషయాన్ని తేల్చారు.
కొవిడ్-19కు(Covid virus) కారణమయ్యే సార్స్ కోవ్-2 వైరస్‌కి వ్యతిరేకంగా శరీర ప్రతిస్పందనను అంచనా వేసేందుకు.. హ్యుమోరల్ ఇమ్యూనిటీపై ఎక్కువగా దృష్టిసారించారు. ఈ అధ్యయనం.. ప్రీప్రింట్ సర్వర్ మెడ్ర్జివ్లో పోస్ట్ చేశారు.
వృద్ధుల్లో సగటున 76 ఏళ్లు, ఆరోగ్య సిబ్బందిలో సగటున 48 ఏళ్ల వారిలో యాంటీబాడీలు తగ్గిపోతున్న రేటు సమానంగా ఉన్నట్లు తేల్చారు పరిశోధకులు. అంతకుముందు నిర్వహించిన పరిశోధనలో.. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత.. కరోనా బారినపడని వృద్ధుల్లోనూ యాంటీబాడీలు తగ్గుతున్నట్లు గుర్తించారు