తెలంగాణ

telangana

ETV Bharat / international

మెక్సికోలో కాల్పులు... ఏడుగురు ముష్కరులు హతం - latest mexico gun fire news

మెక్సికోలో పోలీసులు, దుండగుల మధ్య కాల్పుల వర్షం కురిసింది. ఏడుగురు ముష్కరులను మట్టుబెట్టారు అధికారులు. ఈ ఘర్షణలో ఓ అధికారి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.

mexico
మెక్సికోలో కాల్పులు మోత...ఏడుగురు ముష్కరులు హతం

By

Published : Dec 18, 2019, 8:46 AM IST

మెక్సికోలో మరోసారి తుపాకీ గర్జించింది. గ్వానాజువాటో నగరంలో పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి కూడా మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారని మెక్సికో నేషనల్ గార్డ్ వెల్లడించింది. పెట్రోలింగ్‌ వాహనంపై ముష్కరులు కాల్పులకు తెగబడగా... భద్రతా సిబ్బంది తిరిగి దీటుగా సమాధామిచ్చింది.

ఎందుకు కాల్పులు?

గ్వానాజువాటోలో ప్రభుత్వ పైపుల నుంచి సరఫరా అయ్యే ఇంధనాన్ని కొన్ని ముఠాలు దొంగిలిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో దోపిడీ ముఠాలు వరుసగా కాల్పులకు తెగబడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో మొత్తం 12 మంది.. పోలీసు అధికారులు కాల్పుల్లో మరణించారు.

ఇది చూడండి : ఝార్ఖండ్​ సమరం ఈనెల 30 నుంచి... డిసెంబర్ 23న ఫలితం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details