అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం హూస్టన్‌లో దుర్ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) నిర్వహించిన ఓ మ్యూజిక్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది కార్డియాక్ అరెస్ట్‌ను ఎదుర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.
మ్యూజిక్ కన్సర్ట్‌లో తొక్కిసలాట- 8 మంది మృతి - అమెరికా టెక్సాస్ వార్తలు
ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన అమెరికాలో టెక్సాస్‌లో జరిగింది. ఈ షోకు సుమారు 50వేల మంది వచ్చి ఉంటారని అధికారులు తెలిపారు.
మ్యూజిక్ కన్సెర్ట్‌లో తొక్కిసలాట.. 8 మంది మృతి
'ఆస్ట్రోవరల్డ్' పేరుతో ప్రముఖ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ నిర్వహించిన ఈ షోకు సుమారు 50వేల మంది వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేశారు. ప్రేక్షకులు ఒక్కసారిగా స్టేజ్‌వైపు రావడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.
ఇదీ చూడండి :కుప్పకూలిన విమానం.. 'పాప్‌స్టార్' దుర్మరణం