కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు వైరస్ తీవ్రత ఎక్కువవుతోంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోజుకు 2 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటీ 56 లక్షలు దాటింది. 6.36 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 15,650,441
- మరణాలు: 636,384
- కోలుకున్నవారు: 9,534,840
- యాక్టివ్ కేసులు: 5,479,217
అమెరికాలో ఒక్కరోజే 76 వేలు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఒక్కరోజే 76,570 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,225 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలకు చేరువైంది. 1.47 లక్షల మంది వైరస్‌కు బలయ్యారు.
బ్రెజిల్లో..
కేసులు, మరణాల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలకు చేరువైంది. 84 వేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు.