తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్​కు 70 దేశాల 'స్నేహపూర్వక హెచ్చరిక' - uno

అణ్వాయుధాలను ధ్వంసం చేయాలని ఉత్తర కొరియాను 70 దేశాలు అర్థించాయి. ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు, సంబంధిత కార్యకలాపాలను ఆపేయాలని సూచించాయి.

కిమ్​

By

Published : May 11, 2019, 1:44 PM IST

ఉత్తర కొరియా తాజాగా చేసిన క్షిపణి ప్రయోగాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రపంచ శాంతికి కృషి చేయాలని, అందుకోసం అణ్వాయుధాలు, బాలిస్టిక్​ క్షిపణులను నిర్వీర్యం చేయాలని ఐరాస వేదికగా ఉత్తర కొరియాను 70 దేశాలు కోరాయి.

అణ్వాయుధ నిర్మూలన కోసం ఉత్తర కొరియాను అభ్యర్థించాలని ఫ్రాన్స్​ ప్రతిపాదనలు చేసింది. ఇందుకు 15 దేశాలు మద్దతు పలికాయి. మరిన్ని దేశాలు ముందుకు రావాలని కోరాయి. అమెరికా, దక్షిణ కొరియాతోపాటు ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఐరోపాలోని పలు దేశాలు అంగీకరించాయి.

"ఉత్తర కొరియా అభివృద్ధి చేసుకున్న అణ్వాయుధాలు, బాలిస్టిక్​ క్షిపణులతో ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు తగ్గే విషయంలో మేం ఉత్తర కొరియాకు మద్దతిస్తాం. అమెరికాతో అణు నిరాయుధీకరణ చర్చలను కొనసాగించాలని కోరుతున్నాం."

-ఫ్రాన్స్​ ముసాయిదా సారాంశం

ఉత్తర కొరియా మద్దతుదారులు రష్యా, చైనా మాత్రం ఈ ముసాయిదాకు ఆమోదం తెలపలేదు.

తాజాగా రెండు క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించటంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి చేరాయి.

ఇదీ చూడండి: వారంలో రెండోసారి క్షిపణుల ప్రయోగం

ABOUT THE AUTHOR

...view details