మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో ప్రయాణిస్తున్న ఓ బస్సు కార్గో రైలును ఢీ కొట్టగా ఏడుగురు మరణించారు. మరో 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు డ్రైవర్.. రైలును అధిగమించడానికి ప్రయత్నించే సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ మద్యం సేవించి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపిస్తున్నారు.
రైలును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి - train accident at mexico
మెక్సికోలో ప్రమాదం జరిగింది. కూలీలతో ప్రయాణిస్తున్న ఓ బస్సు కార్గో రైలును ఢీ కొట్టగా.. ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 36 మందికి గాయాలయ్యాయి.
రైలును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
మృతుల్లో ఓ మహిళ, 16 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:కశ్మీర్‌కు మరోసారి విదేశీ ప్రతినిధుల బృందం