అమెరికాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. మూడు మసాజ్ సెంటర్ల వద్ద జరిగిన ఈ కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది ఆసియా మహిళలే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.
మంగళవారం మధ్యాహ్నం తొలుత చెరోకి ప్రాంతంలోని ఓ మసాజ్ సెంటర్ వద్ద దుండగులు కాల్పులు జరిపారు. అయితే.. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొద్ది సేపటి తర్వాత జార్జియా అట్లాంటా ప్రాంతంలోని రెండు మసాజ్ సెంటర్ల వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. అయితే.. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందా? అనే దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.