తెలంగాణ

telangana

ETV Bharat / international

'హెచ్​-4 వీసాదారుల ఉద్యోగ అనుమతులను పునరుద్ధరించండి'

హెచ్​1బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగ అనుమతులను పునరుద్ధరించాలని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ను కోరారు 60 మంది చట్ట సభ్యులు. హెచ్​4 వీసాలతో నైపుణ్యం కలిగిన దాదాపు 95 శాతం మంది భారతీయ మహిళలు ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇమ్మిగ్రేషన్​ విధానంలో లింగ అసమానతలను తొలగించేందుకు ఈ విధానం ఉపయోగపడిందని పేర్కొన్నారు.

60 US lawmakers urge Biden to extend work authorisations to spouses of H-1B visa holders
'హెచ్​4 వీసాదారుల ఉద్యోగ అనుమతులను పునరుద్ధరించండి'

By

Published : Dec 18, 2020, 5:12 PM IST

హెచ్​1బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగ అనుమతులను పునరుద్ధరించాలని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ను కోరారు అగ్రరాజ్యంలోని చట్ట సభ్యులు. ఈ మేరకు 60 మంది చట్ట సభ్యులు బైడెన్​కు లేఖను అందించారు. ప్రస్తుత కరోనా సమయంలో హెచ్​-4 వీసాలున్న మహిళా ఉద్యోగులు అత్యవసర విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. పరిశోధన, ఫార్మా కంపెనీలలోనూ ఉద్యోగులు సేవలందిస్తున్నారని లేఖలో వివరించారు. ట్రంప్​ విధించిన ఆంక్షలతో ప్రస్తుతం హెచ్​4 మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని బైడెన్​కు అందించిన లేఖలో ప్రతినిధులు పేర్కొన్నారు.

హెచ్​-4 వీసాలను అమెరికాలో స్థిరపడ్డ హెచ్​1బీ వీసాదారుల భాగస్వాములు, పిల్లలకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ సేవల శాఖ(యూఎస్​సీఐఎస్) జారీచేస్తుంది. హెచ్​-1బీ వీసాదారుల భాగస్వాములు అగ్రరాజ్యంలో ఉద్యోగావకాశాలు పొందేందుకు వీలుగా హెచ్​-4 వీసాలను 2015 లో హోం​శాఖ జారీ చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే డొనాల్డ్​ ట్రంప్​.. ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికన్ కోర్టుకు తెలిపారు.

డిసెంబర్​ 17 వరకు 1,26,853 హెచ్​-4 దరఖాస్తులను ఆమోదించింది అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ శాఖ. 2018 రిపోర్టు ప్రకారం హెచ్​-4 వీసాలు కలిగిన వారిలో దాదాపు 93 శాతం మంది భారత్​లో జన్మించిన వారేనని తేలింది.

ఇదీ చదవండి :సొంతింటికి వెళ్లేందుకూ ట్రంప్​కు ఇక్కట్లు!

ABOUT THE AUTHOR

...view details