తెలంగాణ

telangana

ETV Bharat / international

5G Services In USA: అమెరికాలో 5జీ సేవలు షురూ - 5g services in america

5G Services In USA: అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలను ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ టెలికాం సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. విమానయాన సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని ఎయిర్‌పోర్టుల చుట్టూ 5జీ సర్వీసుల ప్రారంభాన్నిఏటీ అండ్‌ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి. మిగిలిన చోట్ల సేవల్ని ప్రారంభించినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి.

5G Services In USA
అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

By

Published : Jan 20, 2022, 5:50 AM IST

Updated : Jan 20, 2022, 8:59 AM IST

5G Services In USA: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. విమానయాన సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని ఎయిర్‌పోర్టుల చుట్టూ 5జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్‌ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి. మిగిలిన చోట్ల సేవల్ని ప్రారంభించినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి.

అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేశాయి.

ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. 3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి.

అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.

ఇదీ చూడండి:విమానాలకు '5జీ' బ్రేకులు.. భారతీయుల తీవ్ర ఇబ్బందులు

Last Updated : Jan 20, 2022, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details