తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రత్యేక హోదా కోసం అమెరికా ఎంపీల గళం - అమెరికా పరిశ్రమలు

భారత్​కు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్​పీ)ని పునరుద్ధరించాలంటూ అమెరికన్​ చట్టసభ్యులు ట్రంప్​ పాలకవర్గాన్ని కోరారు. జీఎస్​పీ రద్దుతో అమెరికా భారీగా నష్టపోతోందని పేర్కొన్నారు 44 మంది ప్రతినిధులు. ఈ మేరకు యూఎస్​ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్​ లైట్​హైజర్​కు లేఖను అందజేశారు.

''భారత్​ జీఎస్​పీ హోదా పునరుద్ధరించండి.. నష్టపోతున్నాం''

By

Published : Sep 18, 2019, 1:33 PM IST

Updated : Oct 1, 2019, 1:22 AM IST

భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా జీఎస్​పీని పునరుద్ధరించాలని అమెరికన్‌ చట్టసభలకు చెందిన 44 మంది ప్రతినిధులు ట్రంప్‌ పాలకవర్గాన్ని కోరారు. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌హైజర్‌కు లేఖను అందజేశారు.

భారత్‌తో తదుపరి జరపాల్సిన చర్చల్లో జాప్యం ద్వారా అమెరికా పరిశ్రమలకు నష్టం కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై 26 మంది డెమొక్రాట్లు,18 మంది రిపబ్లికన్లు సంతకాలు చేశారు.

'సుంకాలు వడ్డిస్తున్నా ... పెరిగిన దిగుమతులు'

భారత్‌ను గత జూన్‌లోనే జీఎస్​పీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది అమెరికా. ఈ నిర్ణయంతో ఆర్థికంగానేగాక, ఉద్యోగాల విషయంలోనూ అమెరికా నష్టపోతోందని ప్రతినిధులు చెబుతున్నారు. జీఎస్​పీ హోదా తొలగింపుతో అధిక సుంకాలు వేసినప్పటికీ జూన్‌, జులైల్లో భారత్‌ నుంచి 40 శాతం దిగుమతులు పెరిగినట్లు వెల్లడించారు.

పెరిగిన సుంకాల కారణంగా అమెరికన్ వ్యాపారవేత్తలు ఒక మిలియన్‌ డాలర్ల మేర భారత ఎగుమతిదారులకు బిల్లులు బకాయి పడ్డారన్నారు. కేవలం ఒక జులైలోనే 30 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వచ్చిందన్న ప్రతినిధులు... భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు చేయడం ద్వారా అమెరికా భారీగానే నష్టపోతోందన్నారు.

Last Updated : Oct 1, 2019, 1:22 AM IST

ABOUT THE AUTHOR

...view details