తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కార్చిచ్చు- 400 ఇళ్లు ఖాళీ - కీస్టోన్

ఆమెరికా దక్షిణ డకోటాలోని మూడు వేర్వేరు కొండ ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. మంటలు రాపిడ్​ నగరం వైపు వేగంగా దూసుకొస్తున్నందు వల్ల 400పైగా ఇళ్లను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని దక్షిణ డకోటా గవర్నర్​ తెలిపారు.

South Dakota fires
అమెరికాలో కార్చిచ్చు..400 ఇళ్లు ఖాళీ

By

Published : Mar 30, 2021, 11:43 AM IST

అమెరికా దక్షిణ డకోటా రాష్ట్రంలో మూడు వేర్వేరు కొండప్రాంతాల్లో కార్చిచ్చు రేగింది. మంటలు రాపిడ్​ నగరంవైపు దూసుకొస్తున్నందువల్ల 400పైగా ఇళ్లను ఖాళీ చేయించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. మౌంట్​ రష్​మోర్​ ప్రాంతాన్ని మూసివేశామని వెల్లడించారు.

రాపిడ్​ నగరానికి 24కి.మీ. దూరంలో నెమో ప్రాంతానికి సమీపంలో మొదట మంటలు వ్యాపించి నగరం వైపు విస్తరించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని కలగలేదని స్పష్టంచేశారు.

రాపిడ్​ నగరంలోని కీస్టోన్​లో మరో రెండు చోట్ల మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మంటల్ని ఆర్పడానికి 250 అగ్నిమాపక యాంత్రాల్ని తరలించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:టీకాలు సమకూర్చలేక బ్రెజిల్​ మంత్రి రాజీనామా!

ABOUT THE AUTHOR

...view details