కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభించిన వెంటనే.. టీకాను దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు తగిన ప్రణాళిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వద్ద ఉందని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 40 మిలియన్ డోసులు అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. తమతో వ్యాక్సిన్ సరఫరా ప్రణాళికలను ట్రంప్ ప్రభుత్వం పంచుకోవడం లేదని.. అసలు అధ్యక్షుడి యంత్రాంగానికి ఆ సామర్థ్యం ఉందా? అని 2020 అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ ఇటీవల ప్రశ్నించిన నేపథ్యంలో శ్వేతసౌధం ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
"ఈ ఏడాది చివరి నాటికి 40 మిలియన్ డోసులు అందుబాటులో ఉంటాయి. ఇది ఓ అద్భుతమైన విషయం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన వ్యాక్సిన్ ఇదే. ఇది అధ్యక్షుడు ట్రంప్ వల్లే సాధ్యపడింది. ఆయన చెప్పింది.. చేశారు. ఎందరో అమెరికన్ల జీవితాలను కాపాడుతున్న ట్రంప్‌నకు ధన్యవాదాలు."