ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మందికిపైగా 13-15 ఏళ్ల మధ్య వయస్సు చిన్నారులు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). యువతను ఆకర్షించేందుకు ఏటా పొగాకు పరిశ్రమ వర్గాలు 9 బిలియన్ డాలర్లు ప్రకటనల కోసమే ఖర్చు చేస్తున్నాయని లెక్కగట్టింది.
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని యువతలో అవగాహన కల్పించేందకు చర్యలు చేపట్టింది డబ్ల్యూహెచ్ఓ.
" 40 మిలియన్లకుపైగా 13-15 ఏళ్ల వయస్సు పిల్లలు ఇప్పటికే పొగాకు ఉత్పత్తులను వినియోగించటం ప్రారంభించారు. పొగాకు పరిశ్రమ మార్కెటింగ్ వ్యూహాలపై యువతను అప్రమత్తం చేసేందుకు 13-17 మధ్య వయస్సు పాఠశాల విద్యార్థుల కోసం ఓ కిట్‌ను ప్రారంభించాం. ఏటా సుమారు 80 లక్షల మంది పొగాకు ఉత్పత్తుల కారణంగా మరణిస్తున్నారు. వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు యువతను ఆకర్షించేలా ప్రకటనల కోసం 9 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి బానిసలుగా మారితే కరోనాను ఎదుర్కొనే శక్తిని కోల్పోతారు. ప్రతి పదిమంది పొగ తాగేవాళ్లలో 9 మంది 18 ఏళ్లలోపే ప్రారంభిస్తున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించటం చాలా ముఖ్యం."
- రూడిగర్ క్రెచ్, డబ్ల్యూహెచ్ఓలోని హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్.
ఈ-సిగరెట్ ప్రమాదకరం..