తెలంగాణ

telangana

అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ప్రవాస భారతీయులు

By

Published : Nov 7, 2019, 6:52 PM IST

అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు సత్తాచాటారు. వీరిలో ఓ ముస్లిం యువతి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి వర్జీనియా సెనేటర్​గా విజయం సాధించి రికార్డ్​ సృష్టించారు.

అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ప్రవాస భారతీయులు

అమెరికాలో భారత సత్తాను మరోసారి నిరూపించారు ప్రవాస భారతీయులు. అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన నలుగురు భారత సంతతి వ్యక్తులు విజయం సాధించారు. వీరిలో గజాలా హష్మీ అనే ముస్లిం యువతి తొలిసారి ఎన్నికల్లో పాల్గొని... వర్జీనియా సెనేటర్​గా విజయం సాధించారు.

మాజీ కమ్యూనిటీ కాలేజీ ప్రొఫెసర్,​ ఇండో-అమెరికన్​ అయిన గజాలా ఈ గెలుపుతో చరిత్ర సృష్టించారు. వర్జీనియా స్టేట్​ సెనేటర్​ గెలిచిన మొట్ట మొదటి ముస్లిం మహిళగా రికార్డులకెక్కారు. తొలిసారి ఎన్నికల్లో పాల్గొన్న హష్మీ రిపబ్లికన్​ పార్టీ తరపున పోటీ చేసిన ప్రస్తుత వర్జీనియా సెనేటర్​పై విజయం సాధించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా వద్ద శ్వేతసౌధ సాంకేతిక విధాన సలహాదారుడిగా పని చేసిన 'సుహాస్​ సుబ్రహ్మణం' వర్జీనియా స్టేట్​ హౌస్​ ప్రతినిధిగా ఎన్నికైయ్యారు. వీరితో పాటు భారత సంతతికి చెందిన 'మనో రాజు'... శాన్​ ఫ్రాన్సిస్​ పబ్లిక్​ డిఫెండర్​గా విజయం సాధించగా, 'డింపుల్​ అజ్మెరా'.. షార్లెట్​ సిటీ కౌన్సిల్​కు పోటీ చేసి విజయం సాధించారు.

ఇదీ చూడండి:'హిమ' కశ్మీరం: మంచు కురిసే వేళలో...

ABOUT THE AUTHOR

...view details