తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆంక్షల కొనసాగింపుపై ట్రంప్ కీలక ప్రకటన - అమెరికాలో కరోనా వార్తలు

అమెరికాలో 'స్టే ఎట్​ హోమ్' ఆంక్షలు కొనసాగించబోమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇప్పటికే దేశంలోని 35 రాష్ట్రాలు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ ప్రకటన చేశారు ట్రంప్.

US STATES
ఆంక్షల సడలింపు

By

Published : Apr 30, 2020, 11:19 AM IST

భౌతిక దూరం నిబంధనలను పొడిగించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అమెరికాలో విధించిన ఆంక్షల గడువు నేటితో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆర్థిక సంక్షోభం..

అమెరికాలో తొలుత 15 రోజుల పాటు భౌతిక దూరం నిబంధనలను అమలు చేశారు. అనంతరం వాటిని 30 రోజుల వరకు పొడిగించారు. ఫలితంగా 95 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమతమయ్యారు. చాలా పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి.

కరోనా సంక్షోభంతో అమెరికాలో 2.6 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య 3 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని 50 రాష్ట్రాలకు గాను 35 రాష్ట్రాల్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆంక్షల సడలింపులపై తమ వ్యూహాలను విడుదల చేశాయి.

భవిష్యత్​పై ట్రంప్​ ధీమా...

రాష్ట్రాలు నెమ్మదిగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని.. ఫలితంగా ఆంక్షలు కొనసాగించేది లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి భారీగా పడిపోనుందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నా.. జులై కల్లా పరిస్థితులు చక్కబడతాయని ట్రంప్​తోపాటు ఆయన ఆల్లుడు, సలహాదారు జేర్​డ్ కుష్నర్​ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒక్కరోజే రెండున్నర వేల మంది...

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య బుధవారం భారీగా పెరిగింది. ఒక్క రోజే 2,502 మంది మరణించారు. ఫలితంగా ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 61 వేలు దాటింది. మొత్తం 10.65 లక్షల మందికి కరోనా సోకగా.. 1.47 లక్షల మంది కోలుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details