అమెరికాలోని చికాగోలో కారులో వెళ్తున్న మూడేళ్ల చిన్నారిపై కాల్పులు జరిపారు దుండగులు. మంగళవారం ఉదయం లేక్ షోర్ డ్రైవ్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అంతకు కొన్ని గంటల ముందే సమీప ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనలు చికాగో చరిత్రలోనే హింసాత్మకమని పోలీసులు పేర్కొన్నారు.
చిన్నారిపై గురి..
గ్రాంట్ పార్క్‌లోని ఓ ఆలయం వద్ద ఉదయం 11 గంటలకు కారులో వెళ్తుండగా బాలుడి తలపై కాల్పులు జరిగాయి. దీంతో కొద్ది దూరం ప్రయాణించిన అనంతరం కారు పల్టీ కొట్టింది. ఈ క్రమంలో చిన్నారితో కారులో నుంచి మహిళ బయటకు దూకిందని స్థానికులు చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.