భారత్ సంతతికి చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు.. అమెరికాలో అనుమానాస్పదంగా మృతిచెందారు. న్యూజెర్సీలో నివాసం ఉండే 62 ఏళ్ల భరత్ పటేల్, ఆయన మేనకోడలు నిషా(33), మనుమరాలు.. పెరట్లోని ఈత కొలనులో శవాలుగా కనిపించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
న్యూజెర్సీ స్విమ్మింగ్పూల్లో శవాలుగా భారత కుటుంబం ఈత రాకపోవడమేనా..
తూర్పు బ్రూన్స్విక్లోని క్లియర్వ్యూ రోడ్డులో ఆ కుటుంబం రూ.3.41 కోట్లు విలువైన ఇంటిని గత ఏప్రిల్లోనే కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆ ఇంటి వెనుక ఉన్న పూల్.. మిగతావాటి కంటే కొంత వైవిధ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లోతు కూడా బాగానే ఉన్నట్లు సమాచారం.
'వారిలో ఎవరికీ సరిగా ఈత రాకపోవడం వల్ల భయాందోళనతో మునిగిపోయి ఉంటారు' అని పోలీసులు భావిస్తున్నారు. అంతకుముందు.. విద్యుదాఘాతానికి గురై చనిపోయినట్లు అనుమానించారు. ప్రమాద సమయంలో నిషా పటేల్ అరుపులు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:రష్యా రెడ్స్క్వేర్లో కదం తొక్కిన భారత బలగాలు