న్యూయార్క్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఉత్తర కరోలినా నుంచి వచ్చిన చిన్న విమానం పశ్చిమ న్యూయార్క్‌లోని ఎల్లీకట్ ప్రాంతంలో కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు.
అమెరికాలో కూలిన విమానం- ముగ్గురు మృతి - New York plane crash
ఉత్తర కరోలినా నుంచి వస్తున్న ట్విన్ ఇంజిన్ విమానం న్యూయార్క్‌లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ రవాణా భద్రత బోర్డు దర్యాప్తు ప్రారంభించనున్నాయి.
ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సంబంధాన్ని కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆ రాత్రి ఒంటి గంట వరకు విమాన జాడ కోసం అన్వేషించినట్లు చెప్పారు. చివరకు సోమవారం ఉదయం 10 గంటలకు.. ప్రమాద ప్రాంతంలో 'గ్రూమన్ అమెరికన్ జీఏ-7 ట్విన్ ఇంజిన్' విమాన శకలాలను కనుగొన్నట్లు స్పష్టం చేశారు.
మరణించిన వారిని అలన్ ఫుల్లర్, వాలరీ హోమ్స్, లిండా ఎడ్వర్డ్స్గా గుర్తించినట్లు చౌటావ్క్వా కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ రవాణా భద్రత బోర్డు దర్యాప్తు చేపట్టనున్నాయి.