అమెరికాలో మోంటానాలో ఓ రైలు పట్టాలు(Amtrak train derailment today) తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
సియాటెల్ నుంచి షికాగో మధ్య నడిచే అమ్‌ట్రాక్(అమెరికా జాతీయ రైల్వే)సంస్థకు చెందిన ఎంపైర్ బిల్డర్ ట్రైన్ 7/27 మోంటానలోని జోప్లిన్ వద్ద ప్రమాదానికి(Amtrak train derailed Chicago) గురైనట్లు అధికారులు తెలిపారు. షికాగో నుంచి సెయింట్ పౌల్‌కు వెళ్తుండగా.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ రైలుకు రెండు లోకోమోటీవ్‌లు, 10 బోగీలు ఉన్నాయి. ప్రమాద(Amtrak train derailed video) సమయంలో 147 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది అందులో ప్రయాణిస్తున్నారు.