అమెరికాలోని టెక్సాస్, అలబామా, టెన్నీస్సీ రాష్ట్రాలను టోర్నడోలు కుదిపేశాయి. అనేక సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకొని ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రోడ్లపై చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరిన్ని టోర్నడోలు వచ్చే అవకాశం ఉందని.. వాతావరణ సంస్థ హెచ్చరించింది.