అమెరికా దక్షిణ ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం కూలి ముగ్గురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. ఫ్లోరిడా విమానాశ్రాయానికి వెళ్తున్న ఆ విమానం.. ఓ కారుపై కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తన తల్లితో కారులో ప్రయాణిస్తున్న నాలుగేళ్ల బాలుడు మరణించాడు. విమానంలోని ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బాలుడు తల్లి మేగన్ బిషప్.. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
బీచ్‌క్రాఫ్ట్ బొనాంజా విమానం.. పెంబ్రోక్ పైన్స్‌లోని నార్త్ పెర్రీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానంలో కొద్ది సేపటికే సాంకేతిక సమస్య తలెత్తాయని అధికారులు తెలిపారు. దీంతో విమానం ప్రమాదానికి గురైందని పేర్కొన్నారు.