అమెరికాలోని లూసియానా, మిసిసిపి రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల వీధులన్నీ జలమయ్యాయి. భీకర గాలుల ధాటికి చెట్లు... ఇళ్లపై కూలాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అమెరికా వీధుల్లో పడవలుంటేనే ప్రయాణం!
దక్షిణ అమెరికాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. లూసియానా, మిసిసిపి రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలులు బీభత్సం సృష్టించాయి. వీధుల్లో పడవల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.
అమెరికాలో వరదల బీభత్సం
వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవల్లో వెళుతున్నారు సహాయక సిబ్బంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మిసిసిపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్టేట్ ఎమర్జెన్సీని అమల్లోకి తెస్తున్నట్టు గవర్నర్ ఫిల్ బ్రన్ట్ ప్రకటించారు.