కరోనా వైరస్ నిరోధానికి ఏ ఔషధం పనిచేస్తుందన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెమ్‌డిసివిర్, క్లోరోక్విన్ లాంటి ఔషధాలను గుర్తించారు. ఇప్పుడు కొత్తగా మరో 21 ఔషధాలు కొవిడ్ కారక సార్స్-కోవ్-2పై పనిచేస్తాయని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రిబైస్ మెడికల్ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
12 వేల నుంచి..
ఈ పరిశోధనలు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం వాడకంలో ఉన్న 12,000 ఔషధాలను పరిశీలించిన తర్వాత అందులో 21 ఔషధాలకు వైరస్ వ్యాప్తిని అడ్డుకోగల లక్షణాలున్నాయని వీరు నిర్ధరించారు. ఇందులో నాలుగు ఔషధాలను ఇప్పటికే కరోనా చికిత్సలో వాడుతున్న రెమ్‌డిసివిర్‌తో కలిసి వాడొచ్చని పేర్కొన్నారు. ఈ పరిశోధన అంశాలను 'నేచర్' పత్రిక ప్రచురించింది.