తెలంగాణ

telangana

ETV Bharat / international

'లిథియం-అయాన్​ బ్యాటరీ' పరిశోధకులకు 'నోబెల్​' - 2019 Nobel Prize in Chemistry awarded to John B. Goodenough, M. Stanley Whittingham and Akira Yoshino for the development of lithium-ion batteries

'లిథియం అయాన్​ బ్యాటరీ' పరిశోధకులకు 'నోబెల్​'

By

Published : Oct 9, 2019, 3:42 PM IST

Updated : Oct 9, 2019, 4:39 PM IST

16:28 October 09

'లిథియం అయాన్​ బ్యాటరీ' పరిశోధకులకు 'నోబెల్​'

రసాయనశాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్‌ పురస్కారం వరించింది. జాన్‌ బి గుడెనఫ్‌(యూనివర్సిటీ ఆఫ్​ టెక్సాస్​), ఎం స్టాన్లీ విట్టింగమ్‌(స్టేట్​ యూనివర్సిటీ ఆఫ్​ న్యూయార్క్​), అకిరా యోషినో(జపాన్​ మీజో యూనివర్సిటీ)కు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. 'లిథియం-అయాన్‌ బ్యాటరీ' అభివృద్ధికై ఈ ముగ్గురు చేసిన విశేష పరిశోధనలకు ప్రఖ్యాత పురస్కారం లభించింది. 

గత రెండు రోజుల్లో 2019 ఏడాదికిగానూ వైద్య, భౌతికశాస్త్రాల్లో నోబెల్‌ విజేతలను ప్రకటించిన రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ కమిటీ.. తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్‌ గుడెనఫ్‌ 97 ఏళ్ల వయసులో ఈ గౌరవాన్ని పొందడం విశేషం.

డిసెంబర్ 10న ప్రదానోత్సవం

నోబెల్​ పురస్కారంగా 9 లక్షల 18 వేల డాలర్ల నగదు, పసిడి పతకం, ఒక ధ్రువపత్రం ఇవ్వనున్నారు. డైనమైట్​ను కనుగొన్న 'నోబెల్'.. వర్ధంతి సందర్భంగా డిసెంబర్​ 10న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్య, సాహిత్య రంగాల బహుమతులను స్టాక్​హోమ్​​లో, నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలో ప్రదానం చేయనున్నారు.

15:25 October 09

'లిథియం-అయాన్​ బ్యాటరీ' పరిశోధకులకు 'నోబెల్​'

'లిథియం-అయాన్​ బ్యాటరీ'ని అభివృద్ధి చేసినందుకు ముగ్గురు శాస్త్రవేత్తలను రసాయనశాస్త్రంలో నోబెల్​ బహుమతి వరించింది. జాన్​ బీ గుడెనఫ్​, ఎం స్టాన్లీ విట్టింగమ్​, అకీరా యోషినోకు సంయుక్తంగా అవార్డు ఇస్తున్నట్లు నోబెల్​ కమిటీ ప్రకటించింది.

Last Updated : Oct 9, 2019, 4:39 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details