తెలంగాణ

telangana

ETV Bharat / international

మంచు తుపాను బీభత్సం- విమాన రాకపోకలు బంద్​ - విమాన రాకపోకలకు అంతరాయం

అమెరికాలోని కొలరాడోలో భారీగా మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో డెన్వర్ విమానాశ్రయంలో దాదాపు 2 వేల విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. డెన్వర్​లో 46 నుంచి 61 సెంటిమీటర్ల మేర హిమపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది.

2,000 flights cancelled in Denver as heavy snowstorm arrives
మంచు తుపాను బీభత్సం- విమాన రాకపోకలు బంద్​

By

Published : Mar 14, 2021, 12:12 PM IST

అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచు తుపాను కారణంగా దాదాపు 2 వేల వరకూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం 750 విమానాల రాకపోకల్ని నిలిపివేసింది యాజమాన్యం. ఆదివారం మరో 1,120కు పైగా విమానాల రాకపోకలు ఆపేస్తున్నట్లు తెలిపింది.

డెన్వర్‌లో 46 నుంచి 61 సెంటీమీటర్ల మేర హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్వత ప్రాంతాల్లో 76 సెంటీమీటర్లు హిమపాతం నమోదవుతుందని తెలిపింది. కొలరాడో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అనేక జాతీయ రహదారుల్లో కూడా భారీగా హిమం కురుస్తుండగా.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఇదీ చూడండి:ప్రవాస ఆసియన్లపై దాడుల పట్ల సత్య నాదెళ్ల విచారం

ABOUT THE AUTHOR

...view details